Thursday, March 12, 2026

దావోస్‌లో తెలంగాణ రైజింగ్ విజన్‌ వివ‌రించిన సీఎం రేవంత్‌

Must Read

ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు గూగుల్, ఇజ్రాయెల్, యూఏఈ వంటి అంతర్జాతీయ భాగస్వాములు మద్దతు ప్రకటించగా, రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, వాతావరణ, పట్టణ సమస్యల పరిష్కారంలో సహకారం అందించడానికి ఆసక్తి చూపారు. గూగుల్ వాతావరణ మార్పులు, వ్యవసాయం, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఇన్నోవేషన్, వ్యవసాయం వంటి రంగాల్లో సహకారం పంచేందుకు గూగుల్ ఆసక్తి వ్యక్తం చేసింది. సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో సమావేశమయ్యారు. సమావేశంలో వాతావరణ మార్పులు, వ్యవసాయ ప్రభావాలు, పట్టణ కాలుష్య నియంత్రణలపై చర్చలు జరిపారు. జిల్లా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి నమూనాలను సీఎం వివరించారు. ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలపై చర్చ జరిగింది. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీతో సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్‌టెక్, అగ్రి-టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ రంగాల్లో స్టార్టప్‌లకు మద్దతు, పైలట్ ప్రోగ్రామ్‌ల‌ను ప్రారంభించడానికి ఒప్పందాలు చర్చించబడ్డాయి. తెలంగాణలో ఇన్నోవేషన్‌, స్టార్టప్‌ల అభివృద్ధికి ఇజ్రాయెల్ భాగస్వామ్యం పంచుతుందని ప్రకటించింది. సదస్సులో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌లో తెలంగాణతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపారు. 30,000 ఎకరాల్లో విస్తరించే ఫ్యూచర్ సిటీని నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దారని, ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాసం, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -