ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కర్నూలు శివారులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. ప్రధాని పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని మోడీ ఏపీకి రావడం నాలుగోసారి. కర్నూలు నంద్యాల జిల్లాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సభ మంచి మెసేజ్ ఇచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేశారు. ప్రధాని పర్యటనను ఆస్వాదించారని సీఎం అభినందించారు. శ్రీశైలం మల్లన్న ఆలయ దర్శనంపై ప్రధాని మోడీ సంతృప్తి సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సూపర్ GST కార్యక్రమాలను అభినందించారు. జీఎస్టీ నెల రోజుల కార్యక్రమాలపై సమగ్ర పుస్తకం ప్రచురించాలని సీఎం చంద్రబాబు సూచించారు.