Monday, March 2, 2026

దుబాయ్ పర్యటన ముగించుకొని హైద‌రాబాద్ చేరుకున్న చంద్రబాబు

Must Read

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. మూడు రోజుల పాటు దుబాయ్‌లో 25 కీలక సమావేశాల్లో పాల్గొన్న ఆయన, ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, వనరులు, ప్రభుత్వ సౌకర్యాలను వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ ఇన్వెస్టర్స్ మీట్‌కు ఆహ్వానించారు. గల్ఫ్ దేశాల నుంచి తెలుగు ప్రవాసులతో జరిగిన డయాస్పోరా సమావేశంలో, ఎన్నికల్లో కూటమికి మద్దతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -