తమిళ నటుడు విజయ్ కు చెందిన తమిళగ వెట్రి కళగం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. విజయ్ పార్టీని రద్దు చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణలో హైకోర్టు ధర్మాసనానికి ఈసీ తెలిపింది. కరూర్ లో విజయ్ ప్రచార సభలో తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కలచివేసింది. విజయ్ పార్టీ గుర్తింపు రద్దు చేయడంతోపాటు రాజకీయ పార్టీల ప్రచార సభల్లో మహిళలు చిన్నారులు పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సీజే జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ జస్టిస్ జీ అరుల్ మరుగణ్ ధర్మాసనం విచారించింది. సుప్రీం కోర్టులో పెండింగ్ పిటిషన్లు మినహా కేసుల విచారణకు ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు వాటిని హైకోర్టు పాలనావ్యవహారాల విభాగం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. టీవీకే గుర్తింపు రద్దు విషయంలో పార్టీకి హోదా లేనందున అభ్యర్థన నిలబడదని ఈసీ న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ పేర్కొన్నారు.