తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు విషెస్ అందజేశారు. సామాజిక మాధ్యమాల్లో భారీ సంఖ్యలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తూ రేవంత్ ఆరోగ్యవంతుడిగా ఉండాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ నేతకు జన్మదిన విషెస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్ ద్వారా విషెస్ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో కేంద్రమంత్రి బండి సంజయ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మెగాస్టార్ చిరంజీవి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

