టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎస్వీయూ పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఫిర్యాదు చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గోశాలలో ఆవుల మృతిపై టీడీపీ, వైసీపీల మధ్య తీవ్ర రాద్ధాంతం నడుస్తోంది. ఈ క్రమంలో భూమనకు టీడీపీ సవాల్ విసరగా ఆయన గోశాలకు వచ్చారు. పోలీసులు ఆయనను అడ్డకున్నారు.