Monday, January 26, 2026

అటల్ పెన్షన్ స్కీమ్‌కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్

Must Read

దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించే లక్ష్యంతో అమలులో ఉన్న అటల్ పెన్షన్ యోజనను మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. అలాగే ఈ పథకానికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు, అవగాహన పెంచే చర్యలు, సామర్థ్య నిర్మాణం, అవసరమైన చోట గ్యాప్ ఫండింగ్ అందించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల మద్దతు ఇవ్వనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా అసంఘటిత రంగ కార్మికులు, రోజువారీ కూలీలు, స్వయం ఉపాధి పొందేవారు, చిన్న వ్యాపారులు వంటి వారికి రిటైర్మెంట్ తర్వాత కూడా నెలవారీ పెన్షన్ అందే భరోసా కొనసాగనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా, తాజా నిర్ణయంతో మరింత మంది ఈ స్కీమ్‌లో చేరే అవకాశాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వృద్ధాప్య ఆదాయ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో 2015 మే 9న అటల్ పెన్షన్ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటినుంచి ఈ పథకం దేశవ్యాప్తంగా విస్తృత ఆదరణ పొందింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2026 జనవరి 19 నాటికి 8.66 కోట్లకు పైగా చందాదారులు ఈ పథకంలో నమోదు చేసుకున్నారు. ఇది పథకం ఎంతటి ప్రజాదరణ పొందిందో స్పష్టంగా తెలియజేస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -