Friday, August 29, 2025

బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ : వైయ‌స్ జ‌గ‌న్‌

Must Read

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళలకు హామీ ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను సగం దాకా కత్తిరించి మోసం చేశారని ఆయన ట్వీట్‌లో ఆరోపించారు. “చంద్రబాబుగారూ… అక్కాచెల్లెమ్మల వెన్నుపోటు పొడిచి, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం మోసం కాదా? దగా కాదా?” అని జగన్ ప్రశ్నించారు. ఆర్టీసీ 16 కేటగిరీ బస్సుల్లో కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచిత ప్రయాణం పరిమితం చేయడం, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ ఆంక్షలు పెట్టడం మహిళలను మోసం చేసినట్లేనని అన్నారు. మాజీ సీఎం మరింత తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ – “మా పాలనలో అమలు చేసిన అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం వంటి చారిత్రాత్మక పథకాలను నిలిపివేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టారు. మా కాలం మహిళా సాధికారతకు స్వర్ణయుగం. కానీ మీ పాలన మోసపూరితం” అని విమర్శించారు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలోనూ చంద్రబాబు ఇచ్చిన హామీ తప్పిపోయిందని అన్నారు. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉండగా, ఏడాదికి మూడు సిలిండర్లకు అవసరమైన నిధులు కేటాయించకుండా, ఒక్క సిలిండర్‌కే పరిమితం చేశారని దుయ్యబట్టారు. “ఎన్నికలకు ముందు సూపర్-6, సూపర్-7 అంటూ ప్రకటనలు చేసి, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం మోసం కాదా? అందుకే బాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ” అని జగన్ ట్వీట్‌లో ఎద్దేవా చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -