Saturday, August 30, 2025

స‌రిహ‌ద్దుల్లో మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం

Must Read

భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తెలుగు జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ అమ‌రుడైన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో తెలుగు జ‌వాన్ వీర మ‌ర‌ణం పొందాడు. పాక్‌ దాడులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొడుతున్నా ప్రాణనష్టం జ‌ర‌గ‌డం క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ది. సాధారణ ప్రజల‌తో పాటు జవాన్లు వీరమరణం పొందుతున్నారు.జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో తెలుగు జ‌వాన్‌ సచిన్ యాదవ్‌రావు వనాంజే ప్రాణాలు విడిచారు. సచిన్‌ స్వస్థలం మహారాష్ట్ర – తెలంగాణ స‌రిహ‌ద్దులోని నాందేడ్ జిల్లా తమ్లూర్. సచిన్ మృతితో తమ్లూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయ‌న‌ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -