ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎక్కడ వ్యాపారాలు నిర్వహించాలి? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అనే దానిపై నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అమరావతికి మంజూరైన రైల్వే లైన్ విజయవాడ సమీపంలోని కొత్తపల్లి వద్ద ప్రారంభమవుతుంది.అక్కడి నుంచి కృష్ణా నది మీదుగా అమరావతికి చేరుకుంటుంది. కృష్ణా నదిపై 3.4 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ రైల్వే మార్గంలోనే కార్గో హబ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. రైల్వే లైన్ కు డీపీఆర్ సిద్ధమైందని, త్వరలోనే ఆమోదిస్తామన్నారు. ఆమోదం లభించగానే ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ రైల్వే లైన్ కోసం రూ.2245 కోట్లు కేటాయించనున్నారు. ఇదిలా ఉండగా, బీహార్ రాష్ట్రానికి కూడా రూ.4553 కోట్లతో కేంద్రం రైల్వే లైన్ మంజూరు చేసింది.