సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగిన విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు 20 ప్రశ్నలు సంధించారు. మూడు గంటలకు పైగా విచారించారు. పోలీసుల ప్రశ్నలకు అల్లు అర్జున్ సూటిగా సమాధానం ఇచ్చారు. రేవతి మరణించినట్లు థియేటర్ లో తనకెవరూ చెప్పలేదని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ ను సందర్శిస్తున్నట్లు యాజమాన్యం అనుమతిని పోలీసులు తిరస్కరించారనే సమాచారం తనకు లేదన్నారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని తెలిపారు. రేవతి మరణం పట్ల పోలీసులు తనకు సమాచారం ఇవ్వలేదని మీడియాకు తప్పుడు సమాచారం వెళ్లిందన్నారు. కాగా ఒంటరిగానే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు.