Tuesday, October 21, 2025

త‌ల్లితో అక్ర‌మ సంబంధం.. కూతురిపై అత్యాచారం

Must Read

ఓ యువ‌కుడు తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని రెండున్నరేళ్ల కూతురిపై హత్యాచారం చేసిన దారుణ‌ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకుంది. పైగా స‌ద‌రు యువ‌కుడికి ఆ త‌ల్లి స‌హ‌క‌రించ‌డం విస్మ‌యానికి గురి చేస్తోంది. మహారాష్ట్రలోని మాల్వనీ ప్రాంతంలో ఓ 30 ఏళ్ల మ‌హిళ‌ భర్తకు విడాకులు ఇచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నది. కొద్ది రోజుల నుంచి ఆమె 19 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం కొన‌సాగిస్తోంది. ఈ క్రమంలో మహిళ ఇంటికి వెళ్లి, ఆ మహిళ కూతురుపైనా యువ‌కుడు హత్యాచారం చేశాడు. కన్న కూతురిపై హత్యాచారం చేస్తున్నా చూస్తూ సహకరించిన తల్లి అడ్డుకునేందుకు క‌నీసం ప్ర‌య‌త్నించ‌లేదు. యువకుడి చేతిలో అత్యాచారానికి గురై కాసేపటికి పాప‌ ప్రాణాలు విడిచింది.పాప మూర్ఛపోయి పడిపోయిందని చెప్పి త‌ల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే పాప మృతి చెందిందని నిర్దారించిన వైద్యులు పోస్ట్‌మార్టం చేయగా, ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా విచారణలో పాపపై ప్రియుడు హత్యాచారం చేశాడని తల్లి అంగీక‌రించింది. పోలీసులు ప్రియుడిపై, తల్లిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -