Wednesday, December 18, 2024

అల్లు అర్జున్ అరెస్ట్.. జైలు.. విడుదల! ఎవరిది కుట్ర?

Must Read

అల్లు అర్జున్ అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఉలిక్కిపడింది. తొక్కిసలాటలో మహిళ మృతికి కారణమని అల్లు అర్జున్ ను జైలులో వేశారు. ఒక రోజు జైలు జీవితం గడిపిన అనంతరం విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.
ఇదీ అసలు కథ..
ఈ నెల డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో థియేటర్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్ సుఖ్ నగర్ కు చెందిన రేవతి(39) చనిపోగా.. కొడుకు శ్రీతేజ్ కు గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ యాజమాన్యం, సిబ్బంది, అల్లు అర్జున్, ఆయన బాడీ గార్డ్స్ కారణమని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చారు. శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ను నివాసానికి పోలీసులు చేరుకున్నారు. అరెస్ట్ చేస్తామని చెప్పగా.. అల్లు అర్జున్ సరేనన్నారు. దుస్తులు మార్చుకుంటానని చెప్పగా పోలీసులు ఓకే చెప్పారు. కానీ, బెడ్ రూం వరకు పోలీసులు వెళ్లి, డోర్ ఓపెన్ చేసి దుస్తులు మార్చుకోవాలని పోలీసులు అతిగా ప్రవర్తించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో సినిమా పెద్దలు భారీగా చిక్కడపల్లి పీఎస్ కు చేరుకున్నారు. నిర్మాతలు దిల్ రాజు, బన్నీవాసు, అల్లు అరవింద్ పీఎస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు నిర్వహించి, నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. నాంపల్లి కోర్టు ఏఏకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు.
హైకోర్టు బెయిల్.. ఆలస్యంగా సమాచారం?
నాంపల్లి కోర్టు ఇచ్చిన 14 రోజుల రిమాండ్ తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఏఏకు మధ్యంత బెయిల్ జారీ చేసింది. సంధ్య థియేటర్ పోలీసుల నుంచి అనుమతి తీసుకుందని, పోలీసులు మాత్రం అనుమతి లేదని చెప్పడం సమంజసం కాదని పేర్కొంది. సాయంత్రం 4 గంటలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ, సదరు కాపీలు జైలు సూపరింటెండెంట్ కు అందించడంలో పోలీసులు తీవ్ర జాప్యం చేశారు. దీంతో రాత్రంతా ఏఏ జైలులోనే ఉన్నారు. ఉదయం 5గంటలకు విడుదలయ్యారు.

ఎవరిది కుట్ర?
ఏఏ అరెస్ట్, జైలులో కుట్ర కోణం దాగి ఉందని పలువురు చెబుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏ11గా ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తీవ్ర దుశ్చర్య అని మండిపడుతున్నారు. కేటీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, హరీశ్ రావు, అశ్వినీ వైష్ణవ్ ఈ అరెస్ట్ ను ఖండించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. సదరు కాపీలు ఆలస్యం చేయడం వెనుక ఓ పెద్ద వ్యక్తి దాగి ఉన్నాడనే చర్చ నడుస్తోంది. ఎలాగైనా ఏఏను జైలులో వేయాలని ఆ నేత భావించినట్లు తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

గవర్నర్ ను వీసీగా తొలగించిన రేవంత్!

తెలంగాణ మహిళా యూనివర్సిటీ గతంలో గవర్నర్ వైసీ ఛాన్సలర్ గా ఉండేవారు. కానీ, వీసీగా గవర్నర్ ను తొలగించి, తానే వీసీగా ఉంటానని సీఎం రేవంత్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -