Wednesday, November 19, 2025

ఏపీలో 50 మంది మావోయిస్టులు అరెస్ట్

Must Read

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు నెట్‌వర్క్‌పై పోలీసులు భారీ దాడులు చేస్తూ పెను ప్రభావం చూపారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సీనియర్ మావోయిస్టు నేత మడకం హిడ్మా, ఆయన భార్య హేమా పండిత్ సహా ఆరుగురు మరణించారు. బుధవారం మరో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ ఇంటెలిజెన్స్ ADG మహేష్ చంద్ర లడ్డా.. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు నెలలుగా నిఘా ఉధృతం చేశామని, ఈ ఆపరేషన్ పూర్తిగా ఏపీ పోలీసులదేనని స్పష్టం చేశారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 50 మంది ఛత్తీస్‌గఢ్ మూలాలున్న మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టు రిక్రూట్‌మెంట్ పూర్తిగా స్తంభించిందని, 2026 మార్చి 31లోగా మావోయిస్టు సమస్యను పూర్తిగా అంతం చేస్తామని లడ్డా ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -