భారత దేశభక్తి గీతం ‘వందేమాతరం’ 150 సంవత్సరాల స్ఫూర్తిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో రచించిన ఈ గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రేరణగా నిలిచిందని, తన ‘ఎక్స్’ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ పవిత్ర గీతం సమరయోధులలో ఐక్యతా భావనను రగిల్చిందని, ఆ స్ఫూర్తితో భావి తరాల అభివృద్ధికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

