ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిందని తెలిపారు. ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దేశాభివృద్ది మోదీతోనే సాధ్యమని చెప్పారు. సంక్షేమం సుపరిపాలనతో మోదీ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారని కొనియాడారు. భవిష్యత్తులోనూ కూటమి ప్రభుత్వం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.