బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు ప్రశాంత్ కిశోర్‌ను అరెస్ట్ చేసి షరతులు లేని బెయిల్‌పై విడుదల చేశారు. అయితే, ఈనెల 2వ తేదీ నుంచి దీక్ష చేయడంతో ప్రశాంత్ కిశోర్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.