పెరుగుతున్న వివాహేతర సంబంధాలు
అడ్డొస్తే చంపడానికి సైతం తెగిస్తున్నారు
మనుషుల విచిత్ర ప్రవర్తన
కుటుంబ విలువలు పాయే
వాయీ వరస లేదాయే
భయటపడుతున్నవి హత్యలు, ఆత్మహత్యలే భయట పడనివెన్నో…
ఈ డిజిటల్ ప్రపంచంలో అసలెప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. 90 ఏండ్లు బతికే మనుషులు ఎప్పుడు చనిపోతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు కులం, మతం చూసి పెండ్లి చేసుకుంటుండే. ఇప్పుడు అవేవీ లేవు. అరెంజ్ మ్యారెజ్ కంటే లవ్ మ్యారేజ్ బెటర్ అనే దిశగా యువత సాగుతోంది. కులం, మతం వీడి లవ్ మ్యారేజీల వైపు అడుగులు వేస్తున్నారు. కొన్ని విషయాలు గమనిస్తే లవ్ మ్యారేజీలే బెటర్ అనే దిశగా ప్రస్తుత ప్రపంచం ఉంది. అవునండి ఇది నిజమే…అరేంజ్ మ్యారెజ్ అంటేనే అదొక భూతంలా మారిపోయింది.
అరేంజ్ మ్యారెజ్ చేసుకుంటున్న వారిలో దాదాపు వివాహేతర సంబంధాలు ఏర్పడుతుండటం ఈ రోజుల్లో సర్వసాదారణంగా మారింది. రోజు ఏదో ఒక చోట భర్తపై ప్రియుడితో దాడి, భార్యపై ప్రియురాలితో భర్త దాడి ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి.
సెల్ ఫోన్ యుగంలో పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అందరూ విచిత్ర ప్రవర్తన వైపు మొగ్గుచూపుతున్నారు. వాయి వరసలు పోయి అన్నా, చెల్లుల్లు సైతం సంబంధాలకు తెగబడుతున్నారు. అప్పుడెప్పుడో వీరబ్రహ్మం గారు రాసినట్టు వాయి వరసలు మాని మనుషులు విచిత్రంగా ప్రవర్తించినట్టు ప్రస్తుత యుగంలో అదే జరుగుతుందనడంలో సందేహం లేదు. స్నేహితుని భ్యార్యను మరో స్నేహితుడు, యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు పిల్లల తల్లి, యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న పెండ్లయిన భర్త ఇలా ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇవే కాదు ఒక్కరు ఒకరితోనే కాదు..పదుల సంఖ్యలో లైంగిక సంభందాలు పెట్టుకుంటుండంతో కాలం మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇదంతా ఈ సెల్ ఫోన్ యుగంలోనే ప్రారంభమైనట్టు తెలుస్తోంది.
ఇటీవల తెలంగాణలో ఓ వ్యక్తి స్నేహితుడు తన భార్యతో చనువుగా ఉంటున్నాడని ఏకంగా అతని బాడీలోని అన్ని పార్ట్ లను కోసేశాడు. బీహార్ లో తన భార్య ఏ ప్రియుడితో లేచిపోయిందో ఆ ప్రియుడి భార్యతో పెండ్లి కొడుకు లేచిపోయిన ఘటన చోటుచేసుకుంది. వదినతో మరిది, చెల్లితో అన్న, అక్కతో తమ్ముడు, అమ్మతో కొడుకు, బిడ్డతో నాన్న, తమ్ముడి భార్యతో అన్న ఇలా మరెన్నో అక్రమ సంభందాలు కన్న వాళ్లు, తోడ పుట్టిన వాళ్లు మినహా మిగిలినవి అన్నీ ఇలా వాయీ వరస లేని సంబంధాలు బయటపడుతున్నాయి.
ఏకంగా వారి సంభందాలు ఎక్కడ తెగిపోతాయో అని అడ్డు వచ్చిన వారిని చంపడానికి సైతం తెగిస్తున్నారు. ఇలా భయట పడుతున్నవి ఆత్మహత్యకు, హత్యకు, గాయాల పాలు అయినవే..భయటకు రానివి మరెన్నో…ఇలా ప్రజలు విచ్చల విడి ప్రవర్తనతో చివరికి ఎటు వైపు ప్రయాణిస్తారో ఆ భగవంతుడికే తెలియాలి…