Thursday, January 2, 2025

మీ గుండె భద్రంగా ఉండాలంటే.. ఇవి తప్పక పాటించాల్సిందే!

Must Read

గుండె సంబంధింత సమస్యలతో మరణించే వారి సంఖ్య ఈమధ్య బాగా పెరిగిపోయింది. సైలెంట్, సడన్ హార్ట్ ఎటాక్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. స్కూల్లో పాఠాలు చెబుతూ టీచర్, జిమ్లో శిక్షణనిస్తూ ట్రైనర్, కబడ్డీ ఆడుతూ కుర్రాడు.. ఇలా చాలా మంది హఠాత్తుగా వచ్చే గుండెనొప్పితో కుప్పకూలి చనిపోయిన ఘటనల గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం. సైలెంట్ హార్ట్ ఎటాక్స్ వల్ల ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు పోతున్నాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే మనుషులు దూరం అవుతున్నారు.

గుండె వ్యాధులకు వయసుతో సంబంధం లేదు. వృద్ధులనే కాదు.. మధ్య వయస్కులు, యువత, పిల్లల్లోనూ ఇది కనిపిస్తోంది. ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల లోపు వయసు లోపువారిలో దీన్ని ఎక్కువగా చూడొచ్చు. అధిక బరువు, ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి, వ్యాయామం చేయకపోవడం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం.. ఇలా కారణాలేవైనా గుండె నొప్పి వల్ల అనేక ప్రాణాలు పోతున్నాయి. తమ అనుకున్న వాళ్లు దూరమై ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మరి.. ఈ సమస్య బారిన పడకుండా మన గుండెను భద్రంగా ఉంచుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

స్మోకింగ్‌కు బైబై
మన శరీరాన్ని అనారోగ్యం పాలుచేయడంలో ధూమపానం ఒక కారణంగా చెప్పొచ్చు. కొందరు స్టైల్గా కనిపించాలని, ఏదో సరదాకు సిగరెట్స్ తాగుతుంటారు. మరికొందరు రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం దీన్ని అలవాటు చేసుకుంటారు. అయితే ఎన్నో రకాలుగా శరీరంపై స్మోకింగ్ చెడు ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండెకు కూడా చేటు అని హెచ్చరిస్తున్నారు. స్మోకింగ్ మానేస్తే గుండెకు ఎంతో మంచిదని సూచిస్తున్నారు.

ఒత్తిడికి చెక్
ఈ రోజుల్లో అందరి జీవితాలు ఉరుకులు పరుగులమయంగా మారిపోయాయి. పొద్దున లేస్తే చాలు.. స్టడీస్, జాబ్స్, బిజినెస్ అంటూ అందరూ ఒక రేసులో పడి పరిగెడుతున్నారు. వర్క్ టెన్షన్తో చాలా మంది మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక, కుటుంబ సమస్యల వల్ల కూడా కొందరు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

స్ట్రెస్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అధిక ఒత్తిడి గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్ట్రెస్ దరిచేరకుండా ఉండేందుకు ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయాలని అంటున్నారు. మ్యూజిక్ నేర్చుకోవడం, గేమ్స్ ఆడటం లాంటి వాటిని అలవాట్లుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా ఒత్తిళ్ల నుంచి బయటపడి మనసు తేలికగా అవుతుందని అంటున్నారు.

పర్ఫెక్ట్ డైట్ తప్పనిసరి
ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సరైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంతో పాటు గుండె ఆరోగ్యం కూడా బాగుంటుందని ఎన్నో నివేదికలు చెబుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్కు, స్వీట్లకు గుడ్ బై చెప్పి.. ఇంటి ఆహారానికి అలవాటు పడాలి. ఉప్పును అధిక మోతాదులో తీసుకోకూడదు. డైట్లో ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. మంచి ఆహారాన్ని తీసుకుంటూనే రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ చేయాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

హెల్త్ చెకప్ మర్చిపోవద్దు
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వహించడం మంచిది కాదు. ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించాలి లేకపోతే తర్వాత మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. హెల్త్ విషయంలో ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే చెకప్ చేయించుకోవాలి. ప్రతి ఆర్నెళ్లకు ఓసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. డయాబెటిస్, హై కొలెస్ట్రాల్ లాంటి చెకప్స్ తప్పనిసరి. వీటి వల్ల గుండె సంబంధింత సమస్యలు ఉంటే ముందే తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇవన్నీ పాటిస్తే 30 ఏళ్లు దాటినా మీ గడుండె భద్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హాస్టల్‌లో బాత్‌రూమ్ వీడియోలు.. విచారణకు మహిళా కమిషన్ ఆదేశం

మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌ బాత్‌రూమ్‌లో రహస్య వీడియోలు రికార్డు చేయడం కలకలం రేపుతున్నాయి. హాస్టల్‌ బాత్‌రూమ్‌ వెంటిలేటర్‌పై చేతి గుర్తులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -