కరోనాను తగ్గించే తిప్పతీగ.. తిప్పతీగ ముఖ్యంగా కరోనా సమయంలో ఎక్కువగా ప్రాచూర్యంలోకి వచ్చింది. ఎన్నో మందులు వాడినా తగ్గని కరోనా తిప్పతీగతో నయం అవుతోందని తెలియగానే ఒక్కసారిగా అందరూ తిప్పతీగ గురించి తెలుసుకున్నారు. ఈ తిప్పతీగ భారతదేశంలో విరివిగా దొరుకుతుంది.
చావులేకుండా చేసే తీగ
ఈ తిప్పతీగకు సంస్కృత భాషలో (అమృత) చావులేకుండా చేసేది అనే అర్థం కూడా ఉంది. తిప్పతీగతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను తగ్గించేదుకు కూడా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ వ్యాధులు తగ్గించడంలోనూ తిప్పతీగతో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. పురుషుల్లో లైంగికంగా మెరుగవడంలోనూ, స్త్రీలలో నెలసరికి తిప్పతీగ ఉపయోగపడుతుంది. ఆందోళన, నిరాశ, మానసిక సమస్యలను ఎదుర్కొనేందుకు తిప్పతీగ దివ్య ఔషదం.
తిప్పతీగ వల్ల కలిగే నష్టాలు…
డయాబెటిక్ వ్యాధి ఉన్నవారు తిప్పతీగను తీసుకోకపోవడం మంచిది. గర్భిణులు, బాలింతలు తిప్పతీగను తీసుకోకపోవడం మంచిది. తిప్పతీగను బాలింతలు, గర్భిణులు ఉపయోగించాలనుకుంటే వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న వారు కూడా వైద్యులను సంప్రదించిన అనంతరం తిప్పతీగ తీసుకోవాలి