రక్త పరీక్షలు పలు రకాలుగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్తకణాలు, హిమోగ్లోబిన్, తెల్ల రక్తకణాలు, ప్లేట్ లేట్స్ ఈ టెస్ట్ ల ద్వారా రోగికి ఏ జబ్బు ఉందో తెలుసుకోవచ్చు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఎర్ర రక్తకణాలు కూడా తక్కువగా ఉన్నట్టే.
హిమోగ్లొబిన్ స్త్రీలలో ఎలా తగ్గుతుందంటే…
స్త్రీలలో నెలసరి వల్ల హిమోగ్లోబిన్ తగ్గుతుంది. స్త్రీలలో 11 నుంచి 13 గ్రాములు హిమోగ్లోబిన్ ఉంటే సాధారణంగా ఉన్నట్టు. పురుషుల్లో 14 నుంచి 16 గ్రాములు హిమోగ్లోబిన్ ఉంటే సాధారణంగా ఉన్నట్టు.
ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు:
ఎర్ర రక్త కణాలు 4 లక్షలు ఉండాలి. తెల్ల రక్తకణాలు ఇన్ ఫెక్షన్ అయినచోట పోరాటం చేసేందుకు ఉపయోగపడతాయి. తెల్లరక్తకణాలు పలు రకాలుగా ఉంటాయి. ఇందులో న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, బెసోఫిల్స్. న్యూట్రోఫిల్స్ బ్యాక్టీరియాను శరీరంలో ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయి. లింఫోసైట్స్ వైరల్ ఇన్ ఫెక్షన్ నుంచి శరీరాన్ని కాపాడతాయి. తెల్లరక్తకణాలు 4000 నుంచి 1100 మద్య ఉండాలి. ప్లేట్ లేట్స్ బోన్ మ్యారో లోంచి ఉత్పత్తి అవుతాయి. బోన్ మ్యారో బంద్ అయితే చివరికి 5రోజుల తర్వాత ప్లేట్ లేట్స్ పడిపోతాయి. ప్లేట్ లేట్స్ సాధారణంగా 1,50,000 పైన ఉండాలి.