Friday, April 18, 2025

సినీ ప్రముఖుల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలు

Must Read

గత నాలుగు రోజుల నుంచి టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు చేపట్టిన సోదాలు.. ఈరోజు(శనివారం) తెల్లవారుజాము వరకు కొనసాగాయి. నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ యజమానులు యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, మ్యాంగ్ మీడియా సంస్థకు చెందిన వారి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే దిల్ రాజును శుక్రవారం జూబ్లీ‌హిల్స్‌లోని ఆయన నివాసం నంచి సాగర్ సొసైటీలో ఉన్న ఎస్వీ క్రియేషన్స్ కార్యలయానికి ఐటీ అధికారులు తీసుకెళ్లారు. అయితే, ఎన్నడూ లేని విధంగా ఐటీ రెయిడ్స్ నగరంలో నాలుగు రోజుల పాటు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
- Advertisement -
Latest News

ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధ‌ర్నా

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో చార్జిషీట్ చేసినందుకు ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. రాహుల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -