కన్నడ బిగ్‌బాస్ సీజన్ 11 విన్నర్‌గా రైతు బిడ్డ హనుమంత ట్రోఫీ గెలుచుకున్నాడు. హనుమంతకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు దక్కాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన హనుమంత.. తనదైన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియన్స్‌ను అలరించాడు. కర్ణాటకలోని హవేరికి చెందిన హనుమంత.. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మంచి గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.