Wednesday, November 19, 2025

రష్మిక-విజయ్ క్యూట్ మూమెంట్ వైరల్

Must Read

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రేమ కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీ విభిన్న కోణంలో ప్రేమను చూపించింది. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన విజయోత్సవ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఇటీవల విజయ్-రష్మిక నిశ్చితార్థం జరిగిందన్న పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇద్దరూ ఈ విషయంపై స్పందించలేదు. అదే సమయంలో ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం నిండింది. వేడుకలో విజయ్ రష్మిక చేయి పట్టుకుని ముద్దు పెట్టగా, అభిమానులు ఈలలతో సందడి చేశారు. రష్మిక సిగ్గుతో నవ్వడంతో వాతావరణం మరింత ఉత్సాహవంతమైంది. ఈ మధుర క్షణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా విజయాన్ని జరుపుకుంటూనే ఇద్దరి మధ్య బంధం మళ్లీ చర్చనీయాంశమైంది.

- Advertisement -
- Advertisement -
Latest News

రాజమౌళిపై బీజేపీ నాయ‌కురాలు మాధవీలత ఆగ్ర‌హం

బీజేపీ నాయకురాలు కోంపెల్ల మాధవీలత దర్శకేంద్రుడు ఎస్‌.ఎస్. రాజమౌళి “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చెప్పిన వ్యాఖ్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్లోబల్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -