ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. ఎవరి అండదండలు లేకుండా అవకాశాలు సంపాదించడం, అందలం ఎక్కడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ కొందరు మాత్రం ఇది పాజిబుల్ అని నిరూపించారు. టాలెంట్, కష్టాన్ని నమ్ముకొని హిస్టరీ క్రియేట్ చేశారు. ఎన్ని అనుమానాలు, ఛీత్కారాలు, ఓటములు ఎదురైనా దేనికీ తలొంచకుండా నిలబడి పోరాడారు. ఎదురైన అన్ని పరీక్షలను తట్టుకొని, కాలానికి ఎదురెళ్లి మరీ అనుకున్నది సాధించారు. దీనికి ఎంతో మందిని ఉదాహరణగా చెప్పొచ్చు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. మన దేశంలో టాప్ సినిమా ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ లో ఆమె ఎవరి సపోర్ట్ లేకుండా నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్ కు చేరుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని కంగనా కరెక్టుగా వాడుకున్నారు.
కెరీర్ మొదట్లో బోల్డ్ క్యారెక్టర్లలో యాక్ట్ చేసేందుకు కూడా కంగనా రనౌత్ నో చెప్పలేదు. ఫేమ్, క్రేజ్ తెచ్చుకోవడం మీదే ముందు ఫోకస్ చేశారామె. ఈ క్రమంలో ఆమె నటించిన ‘ఫ్యాషన్’, ‘రాజ్’, ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ వరుసగా సక్సెస్ సాధించాయి. దీంతో ఆమె స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయారు. అయితే తనకంటూ సొంత పాపులారిటీ వచ్చాక కంగనా ఏది పడితే ఆ సినిమా చేసుకుంటూ పోలేదు. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు వచ్చినా వద్దనుకున్నారు. మంచి స్టోరీ, స్క్రీన్ ప్లేతో పాటు తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలకే ఓటేశారు. మహిళా సాధికారత, స్త్రీ స్వేచ్ఛకు ఇంపార్టెన్స్ ఇచ్చే మూవీస్ చేశారు. కంగనా మెయిల్ లీడ్ గా యాక్ట్ చేసిన ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’, ‘జడ్జిమెంటల్ హై క్యా’, ‘తలైవి’ సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో కంగనతో ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేసేందుకు ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు.
‘చంద్రముఖి 2’ మూవీతో మరోమారు సౌత్ ఆడియెన్స్ ను పలకరించారామె. అయితే ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. కానీ సినిమాలో చంద్రముఖి పాత్రలో కంగనా నటన, హావభావాలు పలికించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. అలాంటి కంగన త్వరలో ఓ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా పేరు ‘తేజస్’. సర్వేష్ మేవారా డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ లో పైలట్ గా కనిపించనున్నారు కంగన. 2016లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి తొలిసారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న ‘తేజస్’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ టీజర్ ను విడుదల చేయనున్నారు. ‘ధాకడ్’ తర్వాత మళ్లీ కంగనాను యాక్షన్ మోడ్ లోకి చూసేందుకు ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.