ఏపీ ప్రభుత్వం ఆగస్టు 14న విడుదల కానున్న ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ చిత్రానికి ప్రత్యేక సడలింపులు ఇచ్చింది. రిలీజ్ డే ఉదయం 5 గంటలకు ప్రీమియర్ షో నిర్వహించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే విధంగా, సినిమా విడుదల రోజు నుండి ఆగస్టు 23 వరకు మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 వరకు అదనంగా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది. ప్రీమియర్ షో టికెట్ రేటును గరిష్ఠంగా రూ.500గా నిర్ణయించింది. అంతేకాకుండా చిత్రానికి అదనపు షోలు కూడా కేటాయించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంపై ఎన్టీఆర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.