‘సింగం’.. ఆడియెన్స్ కు బాగా నచ్చిన సిరీస్ ల్లో ఇదొకటి. ఇటు సౌత్ ఆడియెన్స్ తో పాటు అటు నార్త్ లోనూ ఈ సిరీస్ బాగా ఫేమస్ అని చెప్పొచ్చు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘సింగం’ ఇక్కడ పాపులర్. బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ యాక్ట్ చేసిన ‘సింగం’కు మంచి ఆదరణ ఉంది. తమిళ ‘సింగం’కు రీమేక్ గా హిందీ ‘సింగం’ రూపొందింది. అయితే ఈ మూవీ సీక్వెల్స్ విషయంలో హిందీలో మాత్రం వెరైటీ పంథాను ఎంచుకుంటూ కొత్త హీరోలను సిరీస్ లో యాడ్ చేస్తూ పోతున్నారు. హిందీ ‘సింగం’ సిరీస్ ను స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ లో భాగంగా ఆయన తీసిన రెండు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.
‘సింగం-3’ పనుల్లో రోహిత్ శెట్టి ఫుల్ బిజీగా ఉన్నారు. అజయ్ దేవగణ్ మెయిన్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకోణ్ లేడీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పుడీ సిరీస్ లోకి మరో కొత్త పోలీస్ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ‘సింగం-3’లో యాక్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేశారు. తాజాగా టైగర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఏసీపీ సత్యగా గన్ పట్టుకొని స్టైలిష్ గా నడుస్తూ ఉన్న టైగర్ ష్రాఫ్ లుక్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ లుక్ చూసిన అభిమానులు ఇప్పుడు వస్తుంది అసలైన మజా అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
‘సింగం-3’లో దీపికా పదుకోణ్, టైగర్ ష్రాఫ్ తో పాటు స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ కూడా నటించనున్నారు. ఇంత మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ కలయికతో వస్తున్న ఈ మూవీ బాలీవుడ్ లో ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో, ఎన్ని రూ.వందల కోట్లు వసూలు చేస్తుందోననే ఇంట్రెస్ట్ అందరిలోనూ ఉంది. ఇంతమంది స్టార్లను ఒకే సినిమాలో స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా టైగర్ ష్రాఫ్ ను రంగంలోకి దించిన డైరెక్టర్ రోహిత్ శెట్టి.. ‘సింగం’ మూడో పార్ట్ కు సంబంధించి ఇంకా ఎన్ని ట్విస్టులు ఇస్తాడో చూడాలి.