Thursday, September 19, 2024

‘సలార్’తో వరదరాజ ఢీ.. ఇంత డేంజరస్‌గా ఉన్నాడేంటి?

Must Read

ఒకే ఒక్క సినిమాతో రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్. ఆ మూవీనే ‘బాహుమలి’. ఈ సిరీస్ ప్రభాస్ ఇమేజ్ ను అమాంతం ఆకాశం ఎత్తుకు పెంచేసింది. దీంతో తర్వాతి ఆయన నటించే ఫిల్మ్స్ పై ఆ ఎఫెక్ట్ పడింది. డార్లింగ్ మూవీస్ యావరేజ్ గా ఉంటే ఆడియెన్స్ ఒప్పుకోవడం లేదు. ప్రభాస్ నుంచి వస్తే గిస్తే.. సూపర్ హిట్ ఫిల్మ్ రావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్కు సరైన హిట్ పడలేదు. జక్కన్న మూవీ తర్వాత వచ్చినవన్నీ డార్లింగ్ కు నిరాశనే మిగిల్చాయి. దీంతో బ్లాక్ బస్టర్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న ప్రభాస్ క్రేజీ లైనప్ ను రెడీ చేశారు. అందులో భాగంగా మొదట వస్తున్న చిత్రమే ‘సలార్’.

prabhas Salaar

‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ‘సలార్’ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా మాత్రం రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకుంది. ఎట్టకేలకు డిసెంబర్ 22వ తేదీన వరల్డ్ వైడ్ గా ‘సలార్’ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో విలన్గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ పృథ్వీరాజ్ బర్త్ డే. ఈ నేపథ్యంలో ‘సలార్’ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ పోస్టర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా సీరియస్ గా, పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.

prabhas Salaar

నుదుటిపై నల్లటి బొట్టు, మెడలో ఒక టవల్ వేసుకొని పృథ్వీరాజ్ నడుస్తున్న లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో పృథ్వీరాజ్ వెనకాల ఆయన బలగం కూడా చాలా భయంకరంగా కనిపిస్తున్నారు. ‘సలార్’ను నిర్మిస్తున్న హొంబాలే ఫిల్మ్స్ ఈ పోస్టర్ ను నెట్టింట పోస్ట్ చేసింది. ఆ పోస్టుకు వరదరాజ్ మన్నార్.. పృథ్వీరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ పోస్టర్ ను హీరో ప్రభాస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పృథ్వీరాజ్కు ఆయన బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ ఫొటోను చూసిన ఆడియెన్స్ ఈయనేంటి.. ఇంత డేంజరస్గా ఉన్నాడని అంటున్నారు.

ఇక, ‘సలార్’ మూవీ పార్ట్-1లో ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుందని నెట్టింట పలు లీక్స్ వచ్చాయి. ఇందులో ఫుల్ యాక్షన్ మోడ్ లో ప్రభాస్ కనిపిస్తారట. మూవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే థియేటర్లో ఆడియెన్స్ ను విజిల్స్ వేయిస్తుందని సమాచారం. ప్రభాస్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లోకెల్లా బెస్ట్ ఇంటర్వెల్ బ్లాక్ ఉన్న మూవీగా ‘సలార్’ నిలుస్తుందని నెట్టింట వినిపిస్తోంది. అయితే ‘ఛత్రపతి’, ‘రెబల్’, ‘మిర్చి’, ‘బాహుబలి’ సిరీస్ సినిమాల్లో ఇంటర్వెల్ బ్లాక్ లు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. వీటికి మించి ‘సలార్’ ఇంటర్వెల్ సీన్స్ ఉంటాయనే వార్త నేపథ్యంలో అంతగా ప్రశాంత్ నీల్ ఏం చూపించబోతున్నాడా? అని డార్లింగ్ ఫ్యాన్స్ పిచ్చెక్తిపోతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -