Thursday, September 19, 2024

‘తెలుసు కదా’ అంటున్న డీజే టిల్లు.. ఇక రచ్చ రచ్చే!

Must Read

ఒకే ఒక్క మూవీతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు సిద్దు జొన్నలగడ్డ. ‘డీజే టిల్లు’ అనే ఓ చిన్న చిత్రం ఆయన సినీ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అంతకుమందు ‘గుంటూరు టాకీస్’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘కల్కి’ లాంటి పలు మూవీస్ చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఏ ముహూర్తాన ‘డీజే టిల్లు’కు ఓకే చెప్పాడో గానీ సిద్దు తలరాతే మారిపోయింది. గతేడాది రిలీజైన ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏ మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ‘డీజే టిల్లు’ బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. టిల్లు క్యారెక్టర్ లో సిద్దు పండించిన హాస్యానికి థియేటర్లలో ఆడియెన్స్ పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.

‘డీజే టిల్లు’ లాంటి భారీ సక్సెస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డకు చాలా ఆఫర్స్ వచ్చాయట. అయితే ఆయన మాత్రం తిరిగి ఈ మూవీ సీక్వెల్ కే ఓటు వేశారు. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’లో ఆయన నటిస్తున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సిద్దుకు జోడీగా యాక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది ముగింపులో ఈ మూవీ రిలీజ్ కావొచ్చని అంచనా. అయితే ఇంతలోనే మరో చిత్రాన్ని సిద్దు జొన్నలగడ్డ ట్రాక్ ఎక్కించారు. అదే ‘తెలుసు కదా’. ఈ సినిమాతో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఈ చిత్ర విశేషాలను వెల్లడిస్తూ మూవీ యూనిట్ స్పెషల్ వీడియోను తాజాగా రిలీజ్ చేసింది.

ఫిమేల్ డైరెక్టర్స్‌కు ఓకే
‘తెలుసు కదా’ సినిమాలో సిద్దు సరసన ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టితో పాటు మరో స్టార్ హీరోయిన్ రాశీఖన్నా కూడా నటించనున్నారు. ఈ మూవీ ట్యాగ్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రేమిస్తూ ప్రేమను పొందడమే లైఫ్ కు ఉన్న ఏకైక మార్గం అంటూ సినిమా స్టోరీ గురించి కాస్త హింట్ ఇచ్చారు మేకర్స్. ‘తెలుసు కదా’ అనౌన్స్ మెంట్ వీడియోను కింగ్ నాగార్జున, నితిన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. కాగా, ‘తెలుసు కదా’తో పాటు వైష్ణవి అనే మరో ఫిమేల్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయనున్నారు సిద్దు జొన్నలగడ్డ. మరి.. వరుసగా లేడీ డైరెక్టర్స్ తో మూవీస్ చేస్తున్న టిల్లు ఏ రేంజ్ హిట్స్ కొడతాడో చూడాలి.

- Advertisement -
- Advertisement -
Latest News

జానీ మాస్టర్ కు నాగబాబు సపోర్ట్

అత్యాచారం కేసులో అరెస్టైన జానీ మాస్టర్ కు సినీ నటుడు నాగబాబు మద్దతు తెలపడం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనర్ బాలికపై వేధింపులు, అఘాయిత్యానికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -