మగాళ్లది అంతా రివర్స్ సైకాలజీ.. మాజీ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
టాలీవుడ్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్గా ఇంద్రజను చెప్పొచ్చు. హీరోయిన్గా నటిస్తూనే మంచి పాత్రలు దొరికినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ఆమె రాణించారు. తన అందం, అభినయంతో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షోలో జడ్జిగా వ్యవహరిసత్ఉన్నారు. ఇక, నటనతో పాటు మహిళా సమస్యలపై గొంతెత్తడంలోనూ ఇంద్రజ ముందుంటారు.
తాజాగా మహిళల నెలసరి సమస్యలు, వారి ఎమోషన్స్, బాధ్యతల గురించి ఇంద్రజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలు మమ్మల్ని అర్థం చేసుకోలేరా అంటూ పదేపదే భర్తలను అడగడం వల్ల ఎలాంటి లాభం ఉండదన్నారు. సైలెంట్‌గా ఉంటే వాళ్లే మనల్ని అర్థం చేసుకుంటారని ఇంద్రజ అన్నారు. మగాళ్లది అంతా రివర్స్ సైకాలజీ అని ఆమె చెప్పారు. ఓర్పు, సహనంతో ఉండాలన్నారు. అప్పుడే గౌరవం దక్కుతుందన్నారు. వ్యక్తిగత సమస్యలు, మూడ్ స్వింగ్స్‌ను ఎవరికి వారే స్వయంగా హ్యాండిల్ చేయడం అలవర్చుకోవాలని ఇంద్రజ సూచించారు. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.