స్టార్ హీరో ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ సింగిల్ “రెబల్ సాబ్” నవంబర్ 23న విడుదల కానుంది. కొత్త పోస్టర్‌లో వింటేజ్ లుక్‌లో డ్యాన్స్ వేస్తూ కనిపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. తమన్ సంగీతంలో ఈ పాట రాగానే రచ్చ మొదలవుతుందని అభిమానుల ఉత్సాహం. డిసెంబర్‌లో మరో మూడు సింగిల్స్, న్యూ ఇయర్‌కి థియేట్రికల్ ట్రైలర్ ప్లాన్ చేసిన మేకర్స్.. 2026 సంక్రాంతికి (జనవరి 9) సినిమా రిలీజ్ చేయనున్నారు.

