నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస విజయాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఎక్కడ చూసినా రష్మిక హవా కొనసాగుతోంది. పుష్ప బ్లాక్ బాస్టర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఆ తర్వాత ఛావా, సికిందర్, పుష్ప2 వంటి సినిమాలతో సూపర్ హిట్లు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇటీవల కుబేరాతో మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా రష్మిక నటిస్తున్న మరో సినిమా గురించి తన సోషల్ మీడియాలో వెల్లడించింది. తన తర్వాత సినిమా ఏంటో ఊహించండి అంటూ ఫ్యాన్స్ ను పెద్ద కన్ఫ్యూజన్‌లో పడేసింది. నా తదుపరి టైటిల్ ఏమిటో మీరు ఊహించగలరా? నిజంగా ఎవరూ ఊహించగలరని నేను అనుకోను. కానీ మీరు ఊహించగలిగితే నేను మిమ్మల్ని కలవడానికి వస్తానని మాట ఇస్తున్నాను అంటూ తన పోస్టులో పేర్కొంది. ఈ పోస్టుకు రష్మిక ఓ ఫోటోను కూడా జత చేసింది. ఆ ఫోటోలో రష్మిక ఓ పోరాట యోధురాలిగా కనిపిస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.