Tuesday, January 27, 2026

News

ఏపీకి తుఫాన్ ముప్పు.. భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. ఇది శనివారం వాయుగుండంగా, ఆదివారం తీవ్ర వాయుగుండంగా మారనుంది. సోమవారం నాటికి తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు ‘మొంథా’ అని నామకరణం చేయనున్నారు. దీని ప్రభావంతో శనివారం కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి...

కర్నూలు ప్రమాదం.. మొబైల్ ఫోన్ల పేలుడుపై చ‌ర్చ‌

కర్నూలు చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సు లగేజీ క్యాబిన్‌లో 400కు పైగా మొబైల్ ఫోన్ల బ్యాటరీలు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని ఫోరెన్సిక్ బృందాలు తెలిపాయి. బస్సు బైక్‌ను ఢీకొనగా, బైక్ ఆయిల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ కారడంతో మంటలు చెలరేగాయి....

దుబాయ్ పర్యటన ముగించుకొని హైద‌రాబాద్ చేరుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. మూడు రోజుల పాటు దుబాయ్‌లో 25 కీలక సమావేశాల్లో పాల్గొన్న ఆయన, ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, వనరులు, ప్రభుత్వ సౌకర్యాలను వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ...

కల్వకుంట్ల కవిత జనం బాట యాత్ర షురూ!

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి జనం బాట పేరుతో నాలుగు నెలల సుదీర్ఘ యాత్రను అక్టోబర్ 25న ప్రారంభిస్తారు. ఈ యాత్ర ఫిబ్రవరి 13 వరకు 33 జిల్లాల్లో కొనసాగనుంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఇందల్‌వాయి టోల్‌గేట్ వద్ద బైక్ ర్యాలీలో పాల్గొని, జాగృతి కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు....

కర్నూలు ప్రమాదం ఎఫెక్ట్‌తో తెలంగాణలో బస్సుల తనిఖీలు

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు తీవ్రతరం చేశారు. విజయవాడ, బెంగళూరు హైవేలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. రాజేంద్రనగర్‌లోని గగన్‌పహాడ్, ఎల్బీ నగర్‌లోని చింతలకుంట వద్ద బస్సులను పరిశీలించారు. ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లు, వాహన నిబంధనలను తనిఖీ చేసిన...

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబర్ 25న ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏఐసీసీ అగ్రనాయకులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర పరిపాలన, కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల నియామకంపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు...

కర్నూలు ఆస్ప‌త్రిలోనే బస్సు ప్రమాద మృత‌దేహాలు

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ దుర్ఘటనలో నిద్రలో ఉన్నవారు సజీవ దహనానికి గురయ్యారు. తీవ్రంగా దెబ్బతిన్న మృతదేహాలను గుర్తించడం సవాలుగా మారింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 19 మృతదేహాలు పోస్టుమార్టం గదిలో ఉన్నాయి. వైద్యులు డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. ఇప్పటివరకు 19...

సీఎం రేవంత్‌కు కొండా సురేఖ క్షమాపణలు

తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన వివాదంపై క్షమాపణలు చెప్పారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత, అధికారులను బయటకు పంపి, మంత్రులతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గంటన్నర సేపు రాజకీయ అంశాలు, మంత్రుల మధ్య విభేదాలపై చర్చ జరిగింది. సమావేశం అనంతరం మీడియాతో...

కర్నూలు బస్సు ప్రమాదం దర్యాప్తుకు 16 బృందాలు

కర్నూలు జిల్లాలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. బైక్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆరుగురు చొప్పున, తమిళనాడు, కర్ణాటక నుంచి ఇద్దరు చొప్పున, ఒడిశా, బిహార్ నుంచి...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో58 పోటీ!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. నవంబర్ 11న జరిగే పోలింగ్ కోసం 211 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 81 మంది అర్హత పొందారు. వీరిలో 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ స్థాయిలో అభ్యర్థులు పోటీ చేయడం జూబ్లీహిల్స్ చరిత్రలో...

Latest News

దేశ నిర్మాణంలో యువతే కీల‌క‌మ‌న్న ప్రధాని న‌రేంద్ర‌ మోడీ

దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. శనివారం జరిగిన 18వ ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో వీడియో...