అసలు వీటి అర్థం ఏంటి?
బీఎస్ ఈ, ఎన్ఎస్ఈ మధ్య తేడా ఏంటి? పెట్టుబడి పెట్టే ముందు స్టాక్ గురించి, మార్కెట్ ట్రేడ్ గురించి, సూచిక గురించి ప్రాథమికంగానైనా తెలుసుకోవాలి. స్టాక్స్ అంటే కంపెనీ మొత్తం భాగంలో ఒక చిన్న భాగం. కంపెనీలో ఒక షేర్ కొనుగోలు చేస్తే కంపెనీకి మీరు టెంపరరీ ఓనర్ అవుతారు. స్టాక్ ఎక్సేంజ్ అనేది ట్రేడింగ్ గురించి తెలిపే మార్కెట్. ఒక కంపెనీ తన షేర్లను అమ్మాలనుకుంటే, అది స్టాక్ ఎక్సేంజ్ లో రిజిస్టర్ అయి ఉండాలి. ట్రేడర్లు కూడా వివిధ కంపెనీల షేర్లు కొనవచ్చు, అమ్మవచ్చు. స్టాక్ ఎక్సేంజ్ పూర్తి పారదర్శకంగా, వేగంగా ఉంటుంది. అందుకే స్టాక్ ఎక్సేంజ్ ఎక్కువ లిక్విడిటీని అందజేస్తుంది. షేర్లు కొనుగోలు చేశాక, సదరు కంపెనీ లాభాలు జటిస్తే.. షేర్లు కొన్న మనకు ఆదాయం పెరుగుతుంది. షేర్ల డిమాండ్ పెరిగితే షేర్ ధర కూడా పెరుగుతుంది.
మన దేశంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) రెండు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజ్ కంపెనీలు.
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(NSE):
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) ప్రధాన స్టాక్ ఎక్సేంజ్. ఇది ట్రేడింగ్ కోసం వినియోగిస్తారు. డిజిటల్ స్క్రీన్ ద్వారా వివరాలు తెలుపుతుంది. పూర్తి వివరాలను కచ్చితంగా, ఎలాంటి తప్పులు లేకుండా సూచిస్తుంది. NSE ఇతర స్టాక్ ఎక్స్చేంజ్ ల కంటే అతి పెద్దది.
బాంబే స్టాక్ ఎక్సేంజ్(BSE):
బీఎస్ఈ అంటే బాంబే స్టాక్ ఎక్సేంజ్. ఇది ఆసియాలోనే మొట్టమొదటిది. బీఎస్ఈ వేగవంతమైన స్టాక్ ఎక్సేంజ్ కలిగి ఉంటుంది. బీఎస్ఈ తక్కువ పెట్టుబడులు పెట్టడానికి అనువైనది, ఉత్తమమైనది.
ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఈ రెండూ సురక్షితమైన మార్కెట్ వ్యవస్థలే. అధిక లిక్విడిటీ, అధిక లావాదేవీలు కలిగి ఉన్నాయి.