Thursday, March 12, 2026

Today Bharat

తనను బౌల్డ్ చేసిన బౌలర్‌కు కోహ్లీ గిఫ్ట్

రంజీ ట్రోఫీలో తనను క్లీన్ బౌల్డ్ చేసిన ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. తనను ఔట్ చేసిన బంతిపై ఆటోగ్రాఫ్ చేసి సంగ్వాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. సంగ్వాన్‌ మంచి బౌలర్‌ అని.. అతడు భవిష్యత్‌లో మరింత ముందుకెళ్లాలని ఆకాక్షించారు. దీనికి సంబంధించిన...

మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం

మంచు ఫ్యామిలీ వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి నటుడు మంచు మోహన్ బాబు, మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరినీ విచారణకు రావాలని రంగారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ ఆదేశించారు. దీంతో సోమవారం మనోజ్ కీలక డాక్యుమెంట్స్ తీసుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లారు. రంగారెడ్డి జిల్లా...

ICC జట్టులో నలుగురు భారత ప్లేయర్లు

మహిళల U-19 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలోనే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. ఇందులో నలుగురు భారత్ ప్లేయర్లు స్థానం దక్కించుకున్నారు. గొంగడి త్రిష, జి. కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించారు. సౌతాఫ్రికా క్రికెటర్ కైలా...

సోనియా గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ‌పై బీజేపీ ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల ప్రారంభోపన్యాసం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ అభ్యంతరకర పదాలు వాడారని ఆరోపించారు. సోనియా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రపతి గౌరవానికి భంగం వాటిల్లేవేనని పేర్కొన్నారు. 'సోనియా గాంధీ వాడిన పదాలు రాష్ట్రపతి...

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. పాత, కొత్త బేధాలు లేకుండా అధిష్టానం మధ్యేమార్గాన్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఫిబ్రవరి 15 కల్లా నూతన అధ్యక్షుడి నియామకం జరగాల్సి ఉండటంతో.. తెరపైకి ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రామచంద్రారావు, మురళీధర్‌రావు, డీకే అరుణ పేర్లు వినిపిస్తున్నాయి. మురళీధర్‌, డీకే అరుణలో...

కేసీఆర్‌కు బిగ్ షాక్.. లీగల్ నోటీసులు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. అసెంబ్లీకి గైర్హాజరు అవుతున్న కేసీఆర్‌కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ లీగల్ నోటీసులు పంపింది. అపోజిషన్‌ లీడర్‌గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని ఆయనకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని నోటీసులో పేర్కొన్నారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్‌పై అనర్హత వేటు...

ధనుష్-నయన్ వివాదం.. నెట్‌ఫ్లిక్స్‌కు షాక్

‘నానుమ్‌ రౌడీ దాన్‌’ డాక్యుమెంటరీ వివాదంపై నయనతార, ధనుష్‌లు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. నటి నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌‌పై ధనుష్‌ దావా వేశారు. పర్మిషన్‌ లేకుండా ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ విజువల్స్‌ను ‘నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో ఆయన నిర్మాణసంస్థ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ...

పార్టీ మార్పుపై ఎంపీ అయోధ్య రామిరెడ్డి క్లారిటీ

తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలపై వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పందించారు. 'నేను వైసీపీని వీడను. నేను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. కష్టాలు వచ్చినప్పుడే పోరాడాలి.. నిలబడాలి. విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం ఆయన వ్యక్తిగతం.' అంటూ అయోధ్య రామిరెడ్డి...

సిమెంట్ పిచ్‌పై సంజు స్పెషల్ ట్రైనింగ్‌

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో భారత ఓపెనర్ సంజు శాంసన్ (26, 5) పరుగులకే ఔటయ్యాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కే వికెట్ ఇచ్చాడు. రాజ్‌కోట్‌ వేదికగా నేడు (బుధవారం) సాయంత్రం జరిగే మూడో టీ20లో షార్ట్‌ పిచ్‌ బంతులను ఎదుర్కొనేందుకు సంజు తీవ్ర సాధన చేశాడు. త్రోడౌన్...

మళ్లీ క్రికెట్ ఆడనున్న అఫ్గాన్ మహిళలు

అఫ్గాన్‌ మహిళా క్రికెటర్లు మళ్లీ క్రికెట్ ఆడనున్నారు. ఆస్ట్రేలియాకు శరణార్థులుగా వెళ్లిన ఈ జట్టు ఇప్పుడు ఒక్కటిగా కలిసి బరిలోకి దిగనున్నారు. మెల్‌బోర్న్‌‌లో క్రికెట్‌ వితౌట్‌ బోర్డర్స్‌ ఎలెవన్‌తో అఫ్గానిస్థాన్‌ మహిళల ఎలెవన్‌ జట్టు గురువారం ఎగ్జిబిషన్‌ టీ20 మ్యాచ్‌ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా, క్రికెట్‌ వితౌట్‌ బోర్డర్స్, ఆస్ట్రేలియా ప్రభుత్వం...

About Me

1265 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -spot_img