ఏపీలో యోగా టీచర్లు జీతాల కోసం రోడ్డెక్కారు. గత రెండు రోజులుగా విజయవాడలోని సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. కాగా, నేడు మంత్రి లోకేష్‌ని కలవడానికి వెళ్లిన యోగా టీచర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లోకేష్‌ని కలవడానికి వీల్లేదని తిరిగి పంపేశారు. మహిళా యోగా టీచర్లు అని కూడా...
నేడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అధికారికంగా రోశయ్య జయంతి వేడుకలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది.ప్రతి ఏటా జూలై 4న రోశయ్య జయంతి నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ పర్యాటక సాంస్కృతిక...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం అనారోగ్య సమస్యలతో యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కాగా, ఆయనను పరామర్శించేందుకు నేడు ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత యశోద ఆసుపత్రికి వెళ్లారు. తన తండ్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జ్వరం, మధుమేహ సమస్యలతో కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. గురువారం రాత్రి...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, రెగ్యులర్ హెల్త్ చెక్ అప్‌లో భాగమేనని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వైద్యులు, అధికారులతో మాట్లాడి వారికి...
తెలంగాణలో పారిశ్రామిక రంగం అభివృద్ది చెందడానికి ఆయా పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా లాభదాయకంగా ఉండేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహేశ్వరం జనరల్ పార్క్‌లో మలబార్ గ్రూపు స్థాపించిన జెమ్స్ అండ్...
సోషల్ మీడియాలో వేధింపులకు హద్దు అదుపూ లేకుండా పోతోంది. ఏకంగా హైకోర్టు జడ్జికి సైతం వేధింపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో తనపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఏపీ హైకోర్ట్ జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు సోషల్...
భారత పేసర్ మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టు షాకిచ్చింద. తన భార్య, కూతురు సంరక్షణ కోసం నెలకు రూ.4 లక్షలు భరణం కింద చెల్లించాలని షమీని కోర్టు ఆదేశించింది. అయితే షమీ స్థాయికి ఈ భరణం చాలా తక్కువ అని, తాము రూ.10 లక్షల వరకు కోరామని షమీ మాజీ భార్య హసీన్ జహాన్...
కర్ణాటకలో ఇటీవల ఒకే జిల్లాలో గుండెపోటుతో పలువురు చనిపోవడానికి కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని కేంద్రం స్పష్టం చేసింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో 40 రోజుల్లో గుండెపోటుతో 23 మంది యువకులు మృతి చెందారు. అందరూ 19 నుండి 25 ఏండ్ల లోపు యువకులు కావడంతో.. ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌కి ఏమైనా సంబంధం...
కోర్టు ధిక్కరణ పిటిషన్ మేరకు తెలంగాణ సీఎస్ కె.రామకృష్ణ రావు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి టి.కె.శ్రీదేవిలకు హైకోర్టు పిటిషన్ నోటీసులు జారీ చేసింది. ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. మున్సిపాలిటీల్లో ఉండే భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని...
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్ అడ్మిషన్లు పెద్ద ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని మండిపడ్డారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు...