వైసీపీ హయాంలో ఇల్లు నిర్మించుకున్న మహిళలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. వృద్ధురాళ్లు అనే దయ లేకుండా విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇప్పుడున్నది తమ ప్రభుత్వమంటూ దారుణానికి పాల్పడ్డారు. ఇనుప రాడ్లతో కొట్టారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం భోగినేపల్లిలో జరిగింది. ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు...
అక్కినేని నాగచైతన్య, శోభిత దూదిపాళ్ల వివాహం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలోనే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సెట్టింగ్, డెకరేషన్ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు శుభలేఖలు పంచుకున్నట్లు కూడా సమాచారం. డిసెంబర్ 4న వీరిద్దరి పెండ్లి జరుగుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం వచ్చింది. నవంబర్ 5న(మంగళవారం) అమెరికాలో పోలింగ్ జరగనుంది. అయితే, ఇప్పటికే 7 కోట్ల మంది ముందస్తు పోలింగ్ ను వినియోగించుకొని ఓట్లు వేశారు. మిగిలిన ఓటర్లు.. మంగళవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు....
రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15000 రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇందుకు గాను ఏటా రూ.7వేల కోట్లు అవసరం పడతాయని అంచనా. అయితే, ఈ పథకాన్ని 10 లేదా 7 ఎకరాలకు పరిమితం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై అసెంబ్లీలో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో కచ్చితంగా పాదయాత్ర చేస్తానన్నారు. కాంగ్రెస్ పాలనలో దగా పడుతున్న ప్రజలను కలుస్తానన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై పోరాటం చేస్తామన్నారు.
అమెరికా పర్యటనలో నారా లోకేశ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ వెలసిన బ్యానర్లు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. అమెరికాలోని అట్లాంటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి నారా లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నారా లోకేశ్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అంటూ డ్రోన్ల ద్వారా బ్యానర్లు ఎగరేశారు. దీనిపై జనసేన కేడర్...
పోలవరం గరిష్ఠ ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు కూటమి ప్రభుత్వం తగ్గించడంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. దేనికి లూలూచీ పడి ఈ పనికి ఒడిగట్టారని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ, జనసేన ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ...
రాష్ట్రంలో వరి కోతలు మొదలైనప్పటికీ.. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వడ్ల కొనుగోళ్లు లేవు.. రైతు భరోసా లేదు.. అని విమర్శించారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలలో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయిందని.. పూర్తి నష్టపరిహారంలో వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. ఈ...
దేశ వ్యాప్తంగా గ్యాస్ రేటు మళ్లీ పెరిగింది. అయితే, ఇది కమర్షియల్ గ్యాసులకు మాత్రమే వర్తిస్తుంది. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.62 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలతో వ్యాపారులపై భారం పడనుంది. హైదరాబాద్ లో ఎల్పీజీ ధర రూ.2,028.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.1802కి చేరాయి.
ప్రముఖ సినిమా ఎడిటర్ నిషాద్ యూసఫ్(43) అకస్మాత్తుగా కన్నుమూశారు. బుధవారం ఉదయం తన ఇంట్లో మృత్యువై కనిపించారు. ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కొచ్చిలో యూసఫ్ నివాసం ఉంటున్న ఫ్లాట్ లోనే కన్నుమూశారు. ఇటీవల సూర్య హీరోగా తెరకెక్కిన కంగువా మూవీకి ఎడిటర్ గా పనిచేశారు. యూసఫ్ కు భార్య, ఇద్దరు పిల్లలు...
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావడంతో ఆస్పత్రి పాలయ్యారు. కొద్ది రోజుల...