ఏపీలో బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేస్తే నదుల అనుసంధానం పూర్తవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. నీటి లభ్యతను బట్టి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్ కు రోజుకు రెండు టీఎంసీల నీటిని తీసుకెళ్తామన్నారు. ఇది రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి జిల్లాల రిజర్వాయర్ల అనుసంధానం కూడా కంప్లీట్ అవుతుందన్నారు....
సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ మృతి, అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎట్టకేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సీఎం రేవంత్ రెడ్డి టికెట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు అవకాశం కల్పించారు. ఆయన సహకారంతోనే వసూళ్లు పెరిగాయి. అల్లు అర్జున్ విషయంలో తెరవెనుక...
దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 179 కి చేరింది. సియోల్ నుంచి ముయూన్ కు చేరుకుంటున్న విమానం.. రన్ వే నుంచి దూసుకెళ్లి సేఫ్టీ వాల్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ గేర్ లో వైఫల్యం వల్లే ఇలా జరిగింది. ఈ ఘటనలో 179 మంది...
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రన్ వే నుంచి దూసుకెళ్తున్న విమానం ఒక్కసారిగా అదుపు తప్పి గోడను ఢీకొట్టింది. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. 28 మంది అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విమానం మొత్తం 181 మంది ప్రయాణిస్తున్నారు. బ్యాంకాక్ నుంచి ముయాన్...
మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. 92 ఏండ్ల వయస్సులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. నేడు ఢిల్లీలో ఆయన అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకు ఈ యాత్ర కొనసాగుతోంది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు...
సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగిన విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు 20 ప్రశ్నలు సంధించారు. మూడు గంటలకు పైగా విచారించారు. పోలీసుల ప్రశ్నలకు అల్లు అర్జున్ సూటిగా సమాధానం ఇచ్చారు. రేవతి మరణించినట్లు థియేటర్ లో తనకెవరూ చెప్పలేదని...
ఏపీ రాజధాని అమరావతి కోసం ప్రజలపై భారం వేయబోమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకులు ఇచ్చే అప్పులను భవిష్యత్తులో అమరావతి ఆదాయంతో తీరుస్తామన్నారు. అంతేకాని ప్రజలపై భారం వేయమన్నారు. రాష్ట్ర బడ్జెట్ అంతా అమరావతికే ఖర్చు చేస్తున్నామంటూ వైకాపా నేతలు...
హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీ పరిధిలోని సత్వ బిల్డింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమీపంలో మంటలు వచ్చాయి. చూస్తుండగానే బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న...
ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ, ఈడీ రెండూ కలిసి ఈ కేసును విచారించనున్నాయి. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ...
– స్పీకర్ పై కాగితాలు విసిరారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు– తమపై చెప్పులు విసిరారని ఆరోపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం ముందుకు దూసుకొచ్చారు. కేటీఆర్ పై కేసు నమోదు నేపథ్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడ్డారు. దళితుడైన స్పీకర్...