తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ట కేటీఆర్.. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రేపటి ఏసీబీ విచారణలో భాగంగా తనతో న్యాయవాదిని అనుమతించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఈ పిటిషన్‌ను...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భద్రతలో పలు మార్పులు జరిగాయి. చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్(SSG)లో పలు మార్పులు చేశారు. బ్లాక్ క్యాట్ కమాండోలు, SSG సిబ్బందికి అదనంగా ఈ కౌంటర్ యాక్షన్ బృందాలూ రక్షణలో ఉంటాయి. చంద్రబాబుకు రక్షణగా కొత్తగా కౌంటర్...
'ఆవకాయ' ఈ పదం వింటేనే చాలా మందికి నోరూరుతుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఎర్రెర్రని ఆవకాయ పచ్చడితో తింటే అమృతమే. ప్రతి వేసవిలో తెలుగు వారి ఇళ్లలో సంవత్సరానికి సరిపడా ఆవకాయ పచ్చడి తప్పకుండా పెడుతుంటారు. 2024 సంవత్సరంలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వంటకాల్లో ఆవకాయ పచ్చడి ఫస్ట్ ప్లేస్‌లో...
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి బన్నీ ఆస్పత్రి లోపలికి వెళ్లారు. సుమారు 20 నిమిషాల పాటు ఆస్పత్రిలో ఉన్న అల్లు అర్జున్.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి,...
ఈనెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు భరోసా’ సాయాన్ని అందజేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి ఎకరానికి రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తున్న నేపథ్యంలో దాదాపు కోటి ఎకరాలకు ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది. అంటే రూ.5,500 కోట్ల...
ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్‌లు, పోలీసులకు హైకోర్టు ఊరట లభించింది. ఈ కేసులో ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతురావు, సీఐ సత్యనారాయణలకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విద్యాసాగర్ ఫిర్యాదుతో పోలీసులు తనను వేధించారని జత్వానీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని...
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు ప్రశాంత్ కిశోర్‌ను అరెస్ట్ చేసి షరతులు లేని బెయిల్‌పై విడుదల చేశారు. అయితే, ఈనెల 2వ...
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించింది. ఏసీబీ అరెస్ట్ చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్...
ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో స్వల్పంగా భూమి కంపించింది. మరోవైపు నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా బిహార్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై...
టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని మరింత ముందు స్థానంలో ఆడించవచ్చన్నాడు. బౌలింగ్ మెరుగు పరుచుకుంటే నితీశ్...