ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ సీనియర్ నేత ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది. న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్...
టీటీడీ పరకామణి కేసులో ముఖ్య పరిణామం జరిగింది. సీజ్ చేసిన వివరాలు సీల్డ్ కవర్ లో హైకోర్టు రిజిస్టర్ కి సీఐడీ అధికారులు అందజేశారు. తదుపరి విచారణను ఈనెల 27కి హైకోర్టు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయనందుకు టీటీడీపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటర్ వేయకుండా జాప్యం చేసినందుకు ఏపీ న్యాయవాదుల...
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కర్నూలు శివారులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. ప్రధాని పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు....
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్ వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ ఈ వివాదాన్ని సృష్టించిందని మంత్రి నారాయణ తోసిపుచ్చారు. విశాఖ పర్యటనలో వర్మ మంత్రి నారాయణను కలిసి వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. టెలీకాన్ఫరెన్స్ మాటలను కట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మంత్రి నారాయణ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడని...
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మభ్యపెడుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ ధ్యేయంగా శనివారం బీసీ బంద్ కు మద్దతు ప్రకటించారు. తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతిగా ఉందని చెప్పారు. జాగృతి కార్యకర్తలు బంద్ లో పాల్గొంటారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ లో చట్టం చేసే...
బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ ధ్యేయంగా ఈనెల 18న తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. బంద్ మద్దతుగా అఖిలపక్ష బీసీ సంఘాలు హైదరాబాద్ లో ముందస్తు సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి. బషీరాబాగ్ కూడలి నుంచి ట్యాంక్ బండ్ పై అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. బీసీ ఐకాస చైర్మన్ ఆర్...
కరూర్‌లో టీవీకే ప్రచార సభలో తొక్కిసలాట ఘటనపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు మొదలుపెట్టింది. ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం రాత్రి కరూర్ చేరుకుంది. ఏఎస్పీ ముఖేశ్ కుమార్ డీఎస్పీ రామకృష్ణన్ సహా ఆరుగురు సభ్యుల బృందం శుక్రవారం దర్యాప్తు ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలోని టూరిజం గెస్ట్ హౌస్...
తమిళ నటుడు విజయ్ కు చెందిన తమిళగ వెట్రి కళగం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. విజయ్ పార్టీని రద్దు చేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణలో హైకోర్టు ధర్మాసనానికి ఈసీ తెలిపింది. కరూర్ లో విజయ్ ప్రచార సభలో తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోవడం...
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. మనోజ్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సమగ్రత దార్శనికత కలిగిన నాయకుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. మనోజ్ ట్వీట్ లో మౌనిక గౌరవనీయ డీజీపీ శివధర్ రెడ్డిని...
ప్రతీ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ సమీక్షలో అధికారులకు సూచనలు చేశారు. పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయండి అని అన్నారు. తొలి దశలో ఔటర్ రింగురోడ్డు లోపల...