Thursday, November 21, 2024

విశాఖ‌కు కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు

Must Read

మెరిసిపోతున్న వైజాగ్‌

ప్ర‌తిష్టాత్మ‌కంగా గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ స‌మ్మిట్‌

విశాఖ‌కు కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధానిగా అవ‌త‌రించ‌బోతున్న విశాఖ న‌గ‌రానికి పారిశ్రామిక‌ శోభతో మెరిసిపోతోంది. వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023 కోసం విశాఖ నగరం రెడీ అయ్యింది. ఈ నెల 3, 4వ తేదీల్లో నిర్వ‌హిస్తున్న ఈ స‌మ్మిట్‌కు 26 దేశాల నుంచి సుమారు 8 వేల మంది హాజరుకానున్న ఈ భారీ పెట్టుబడుల సదస్సు నగరంలోని అన్ని రంగాల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఏపీకి భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)లో పాల్గొనేందుకు కార్పొరేట్‌ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి. విశాఖ సమ్మిట్‌లో పాల్గొనేందుకు బుధవారం ఒక్క రోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్ నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 12,000కిపైగా నమోదు కావడం గమనార్హం.

హై సెక్యూరిటీ జోన్‌గా విశాఖ
దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు , ఆరుగురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండు రోజులపాటు విశాఖ నుంచే కార్యకలాపాలు కొనసాగించనున్నారు. దీంతో హై సెక్యూరిటీ జోన్‌గా విశాఖ‌ను మార్చారు. ఈ సమావేశాల్లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొంటున్నారు.

కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమారమంగళం బిర్లా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఎండీ, సీఈవో సంజీవ్‌ బజాజ్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ నవీన్‌ జిందాల్, జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ గ్రంధి మల్లిఖార్జునరావు, రెన్యూ పవర్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమంత్‌ సిన్హా, దాల్మియా భారత్‌ గ్రూప్‌ ఎండీ పునీత్‌ దాల్మియా , సైయెంట్‌ ఫౌండర్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, సెంచురీ ప్లేబోర్డ్స్‌ చైర్మన్‌ సజ్జన్‌ భజాంక, గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ ప్లానెట్‌ సెక్రటరీ జనరల్‌ సత్య త్రిపాఠి, పెగాసస్‌ క్యాపిటల్‌ ఫౌండర్‌ సీఈవో క్రైగ్‌ కాట్, పార్లే ఫర్‌ ది అడ్వైజర్స్‌ ఓషన్స్‌ సిరిల్‌ గచ్, శ్రీ సిమెంట్‌ చైర్మన్‌ మోహన్‌ బంగర్, ఒబెరాయ్‌ గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అర్జున్‌ ఒబెరాయ్, టెస్లా కో¸ఫౌండర్ మార్టిన్ ఎబర్‌హార్డ్, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా తదితరులు పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో 2500 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ శ్రీకాంత్‌ తెలిపారు. సమ్మిట్ జరిగే ఏయూ నుంచి విమానాశ్రయం వరకు, బీచ్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లించారు.. ట్రాఫిక్‌ రద్దీ, వీఐపీల తాకిడి దృష్ట్యా.. వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సీపీ కోరారు.. శుక్ర, శనివారాలు బీచ్ కు వెళ్లేవారు తమ వాహనాలను ఏపీఐఐసి గ్రౌండ్ లో పార్క్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

కేటీఆర్‌ ట్వీట్
ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. విశాఖలో ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ విజయవంతం కావాలని కేటీఆర్‌ ఆకాక్షించారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని కేటీఆర్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

కాగ్ చీఫ్ గా సంజయ్ మూర్తి

కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) సీనియర్ ఐఏఎస్ అధికారి కె. సంజయ్ మూర్తి నియామకం అయ్యారు. గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన...
- Advertisement -

More Articles Like This

- Advertisement -