ప్రభుత్వాలు…ఉచిత పథకాలు…ధరలు…
ధరలు పెరుగుతున్నాయని అనుకుంటున్నామే కానీ అవి ఎందుకు పెరుగుతున్నాయో ఎవరూ ఆలోచించరు. ఉచిత పథకాలు పెరుగుతున్న కొద్దీ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకంటే ధరల వెనుక ఉన్న అతి పెద్ద రహస్యం ఉచిత పథకాలు. నాయకులు గెలవాలంటే మన దేశంలో ఉచిత పథకాలు ఇవ్వాలి. ఉచిత పథకాలు ఇచ్చి ధరలు పెంచాలి. ప్రస్తుతం జరుగుతున్న దేశ రాజకీయాలు ఇలానే ఉన్నాయి. ప్రజలు పథకాలు వస్తున్నాయి అని సంబరపడుతున్నారే కానీ ధరలు పెరుగుతున్నాయని మాత్రం ఆలోచన చేయడం లేదు.
ఉచిత పథకాలతో ఎవరికీ లాభం…ఎవరికి నష్టం…
ఉచిత పథకాలతో ముఖ్యంగా ధనికులే లాభపడతారు. పేదలు, మద్యతరగతి వారు తీవ్ర నష్టాన్ని చూస్తారు. అసలే చాలీ చాలని జీతాలు దీనికి తోడు ధరల పెరుగుదల వారికి భారంగా మారుతుంది. పూట గడవని ప్రజలు కొందరైతే, నెల గడవడానిక చాలీ చాలని జీతాలతో జీవనం సాగించేవారు మరికొందరు. ఉచిత పథకలు ఇవ్వడం మూలాన పేదలకు వచ్చేది ఏమీ లేదు. అవి వారికి కొంత మేరకు మేలు చేసినా దీర్ఘకాలంలో వారికి ఇబ్బందులను సృష్టిస్తాయి. వారి ఎదుగుదలను ఆపేస్తాయి. అయితే ఇప్పుడు ఇస్తున్న ఉచిత పథకాలు పేద, ధనిక అని బేధం లేకుండా అందరికీ ఇస్తున్నారు కొన్ని పథకాలను ప్రభుత్వాలు. వీటి మూలాన ప్రభుత్వం అప్పుల్లోకి కూరుకుపోయి ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా నిత్యావసర వస్తువులపై ఈ భారం ఎక్కువగా ఉంటుంది. ఇలా పెరగడం మూలాన ధనికుల కంటే ఎక్కువగా నష్టపోయేది పేదలు, మద్యతరగతి ప్రజలే.