కొద్దిరోజుల విరామం తర్వాత దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుండటం కొనుగోలుదారులను కలవరపెడుతోంది. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1240 రూపాయలు పెరిగి లక్ష 27 వేల 800 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర 1150 రూపాయలు పెరిగి లక్ష 17 వేల 150 రూపాయల వద్ద కొనసాగుతోంది.
గత వారమంతా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈ వారం ప్రారంభమైన రెండు రోజుల్లోనే 10 గ్రాములపై 2500 నుంచి 2720 రూపాయల వరకు పెరగడం గమనార్హం. మరోవైపు బంగారం ధరలు భగ్గుమంటున్నప్పటికీ వెండి ధర మాత్రం ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర లక్ష 75 వేల రూపాయల వద్ద నిలకడగా ఉంది.

