Tuesday, November 24, 2026

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Must Read

తిరుమల క్షేత్రంలో శ్రీవారి భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఉచిత దర్శనం కోసం వచ్చే భక్తులు కంపార్టుమెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా క్యూలైన్లోకి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రద్దీకి అనుగుణంగా సర్వదర్శనానికి కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుండగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒకటి నుంచి రెండు గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

సోమవారం నాడు స్వామివారిని మొత్తం 75 వేల 640 మంది భక్తులు దర్శించుకోగా 23 వేల 439 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి 4 కోట్ల 13 లక్షల రూపాయల ఆదాయం లభించింది. అలాగే 4 లక్షల 4 వేల లడ్డూలను విక్రయించగా లక్షా 66 వేల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారని టీటీడీ తెలిపింది.

- Advertisement -
- Advertisement -
Latest News

మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధరలు

కొద్దిరోజుల విరామం తర్వాత దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -