Tuesday, November 24, 2026

తెలుగు రాష్ట్రాల మధ్య విబేధాలు వ‌ద్దు – కవిత

Must Read

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ పరస్పర సహకారం మరియు స్నేహభావంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు తలెత్తడం విచారకరమని పేర్కొంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఇలాంటి వైఖరి వల్ల ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలు మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. నీటి వివాదాలు మరియు అక్రమాల అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకోవాలని కోరారు. అక్రమాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధరలు

కొద్దిరోజుల విరామం తర్వాత దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -