ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ల పర్వం భారీ పోటీ మధ్య ముగిసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న 42 రెవెన్యూ డివిజన్లు 201 మండలాలు మరియు 3949 గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడతలో సర్పంచ్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు కలిపి మొత్తం 118114 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచ్ పదవులకు 25985 నామినేషన్లు రాగా వార్డు సభ్యుల పదవులకు 92129 నామినేషన్లు సమర్పించబడ్డాయి.
జిల్లాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రంలోనే అత్యధికంగా 404 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడిన తిరుపతి జిల్లా నామినేషన్ల సంఖ్యలో అగ్రస్థానంలో నిలిచింది. తిరుపతి జిల్లాలో సర్పంచ్ పదవులకు 3261 నామినేషన్లు వార్డు సభ్యుల స్థానాలకు 7088 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో 1822 వైఎస్ఆర్ కడప జిల్లాలో 1550 మరియు అనకాపల్లి జిల్లాలో 1347 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

