Monday, November 2, 2026

రాప్తాడు దాడి కేసులో కీలక పరిణామం

Must Read

అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులపై జరిగిన దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, అతడు పోలీసు అధికారిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరపడంతో అతడి రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం అతడిని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించగా, కుడి కాలులో ఇంకా మూడు బుల్లెట్లు ఉన్నట్లు వైద్య వర్గాల సమాచారం.

నిందితుడి కాళ్లకు గాయాలు తీవ్రంగా ఉండటంతో వైద్యులు శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాళ్ల పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వాటిని తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు పాఠశాలలో జరిగిన దాడిలో గాయపడిన ఇద్దరు విద్యార్థినులను తొలుత అనంతపురం ఆస్పత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించడంతో పాటు విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చకు తెరలేపింది.

- Advertisement -
- Advertisement -
Latest News

ఢిల్లీలో నేటి నుంచి ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్

దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని విస్తరించడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో 2026...
- Advertisement -

More Articles Like This

- Advertisement -