Monday, November 2, 2026

హైదరాబాద్ వేదికగా అమిత్ షా రాజకీయ సమరభేరి

Must Read

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో బీజేపీ తన రాజకీయ వ్యూహానికి హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకుంది. ఢిల్లీలో విపక్షాల భారీ ర్యాలీ ముగిసిన వెంటనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో బీజేపీ భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా ముందుగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం కాకతీయ హోటల్‌లో విశ్రాంతి తీసుకోనుండగా పలువురు మీడియా, సినీ రంగ ప్రముఖులతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

సాయంత్రం నాలుగు గంటలకు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రారంభమయ్యే మహా పాదయాత్రలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తెలంగాణ బీజేపీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేపట్టింది. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా పాదయాత్ర మార్గాన్ని పరిశీలించి పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. మార్గమంతా పార్టీ జెండాలు, బ్యానర్లు, హోర్డింగులతో పాటు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ వేదికగా విపక్షాల విమర్శలకు అమిత్ షా గట్టి సమాధానం ఇవ్వడంతో పాటు తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి సందేశం ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
- Advertisement -
Latest News

ఢిల్లీలో నేటి నుంచి ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్

దేశంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని విస్తరించడంతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో 2026...
- Advertisement -

More Articles Like This

- Advertisement -