Wednesday, October 14, 2026

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

Must Read

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి చిత్రపటం బహూకరించిన అనంతరం రాష్ట్రపతి పద్మావతి అతిథి గృహానికి బయలుదేరారు. రాంభగీచ వసతి గృహం వద్ద ఆగి భక్తులతో మాట్లాడి చాక్లెట్లు పంచారు. అనంత‌రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. వారి వెంట‌ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తదితరులున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కాక్రోచ్ పార్టీ నిరసనకు పోలీసుల బ్రేక్

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీలో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -