టీటీడీ మాజీ ఛైర్మన్, వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సుమారు 10 గంటల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని తిరుపతి సిట్ కార్యాలయానికి తరలించారు. అవసరమైతే మళ్లీ హాజరు కావాలని సూచించారు. విచారణ అనంతరం సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ “అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చా. కల్తీ నెయ్యి వాస్తవాలు బయటపడాలనే సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేశా. అవినీతి చేయాలంటే కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి, నెయ్యి ఎందుకు?” అని ప్రశ్నించారు. 2014 నుంచి నెయ్యి సరఫరాలపైనా విచారణ జరపాలని, తన పీఏ కాదని 2018 నుంచే అప్పన్న అని స్పష్టం చేశారు. ఎప్పుడైనా పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు.

